NTV Telugu Site icon

West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి

West Bengal Incident

West Bengal Incident

8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.

మాల్ నదీలో దుర్గా మాత విగ్రహం నిమజ్జనం కోసం వందలాది మంది గుమిగూడారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మాల్ నదీ ప్రవాహం పెరిగింది. ఊహించని విధంగా మెరుపు వరద సంభవించడంతో చాలా మంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. చాలా మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. దాదాపుగా 50 మందిని ఈ వరదల నుంచి రక్షించారు.

Read Also: CM KCR: సీఎంగా ఉంటూనే.. దేశమంతా పర్యటిస్తా

అకాస్మత్తుగా, ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు కొట్టుకుపోయారని.. ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించామని జల్పాయిగురి కలెక్టర్ మౌమితా గోదారా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్, పోలీస్, స్థానిక రెవెన్యూ యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తప్పిపోయివ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా దుర్గా విగ్రహ నిమజ్జనం వేడుకలో విషాదం నెలకొంది. సికంద్రా పీఎస్ పరిధిలో 15 ఏళ్ల బాలుడు, న్యూ ఆగ్రా పీఎస్ పరిధిలో ఇద్దరు యువకులు యమునా నదిలో మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగినా మృతదేహాలు లభించలేదు.