Indian Army Chief Warns Pak: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సీమాంతర టెర్రరిజాన్ని ఆపకపోతే.. పాక్ భౌగోళిక, చారిత్రక అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లోని ఆర్మీ పోస్ట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఈ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో మేం కొద్దీగా సహనాన్ని ప్రదర్శించాం.. కానీ, ఈసారి అలా ఉండదు.. పాక్ మళ్లీ మమ్మల్ని రెచ్చగొడితే.. సింధూర్ 2.0ను చూస్తుంది అన్నారు. భౌగోళిక చరిత్రలో ఉండాలని అనుకుంటారా? లేదా? అనేది ఆ దేశం ఆలోచించుకోవాలి అని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.
Read Also: Dhruv Jurel: అహ్మదాబాద్ టెస్టులో ధ్రువ్ జురెల్ సెంచరీ.. శతకానికి చేరువలో జడేజా
ఇక ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని తక్షణమే ఆపి తీరాల్సిందే అని ఆర్మీ చీఫ ద్వివేది తెలిపారు. లేకపోతే చరిత్ర నుంచి దాయాది దేశం తుడిచి పెట్టుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. అంతేగాక, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సైనికులకు ఆదేశించారు. కాగా, భారత్‌కు పశ్చిమాన ఉన్న సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ సైన్యం చురుగ్గా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం ముందస్తుగా పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. నిన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దాయాది దేశానికి హెచ్చరించారు.
