NTV Telugu Site icon

EY CA Death Case: “సీనియర్ ఉద్యోగి ఫ్రెషర్స్‌ని లైంగికంగా వేధించాడు”.. EY ఘటన నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగి సంచలన ఆరోపణ..

Ey Ca Death Case

Ey Ca Death Case

EY CA Death Case: ‘‘ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY)’’లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ ఇటీవల మరణించిన అంశం కార్పొరేట్ రంగంలో పని గంటలు, ఒత్తిడిని హైలెట్ చేసింది. కార్పొరేట్ రంగంలో ఎలాంటి పని ఒత్తిడి, ఆఫీస్ కల్చర్‌పై పశ్నల్ని లేవనెత్తింది అన్నా తల్లి తన కూతురు ఒత్తిడి, పనిభారంలో మరణించారని ఆరోపించారు. అయితే, తన కూతురు అంత్యక్రియలకు ఒక్క సహోద్యోగి రాలేదని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఆమె మరణం కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ బాధల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరణించిన అన్నా సెబాస్టియన్‌కి సంతాపం తెలుపుతున్నారు.

Read Also: Terror Attack: పాకిస్థాన్ ఆర్మీపై తెహ్రీక్-ఏ-తాలిబాన్ భారీ ఉగ్రదాడి.. ఆరుగురు సైనికులు మృతి

తాజాగా డెలాయిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తన అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘ ఈవై కేసు కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది. డెలాయిట్లో నా వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము ఉదయం 5 గంటలకు పని, ఆరోగ్యం గురించి నా స్నేహితుడితో చర్చించుకున్న చాట్‌ స్క్రీన్ షాట్స్ జత చేస్తున్నాను. మేము 20 గంటల పాటు పనిచేస్తాము. అన్నా విషయంలో ఏం జరిగిందో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీరు వారికి కేవలం ఉద్యోగి సంక్య మాత్రమే అని ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం. కార్పొరేట్ జీవితం చాలా కష్టం. సకాలంలో అందులోంచి బయటపడటం ఆనందంగా ఉంది’’ అని జయేష్ జైన్ ట్వీట్ చేశారు.

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ గురించి మరో ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె తన ఎక్స్‌లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ‘‘”నేను TCSలో కాంట్రాక్ట్ బాండ్‌పై ఒక సంవత్సరం ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు, నా టీమ్ లీడ్ నన్ను మరియు ఇతర ఫ్రెషర్‌లను లైంగికంగా వేధించాడు. అతడిని ప్రతిఘటించిన కారణంగా మాకు పని ఒత్తిడి పెంచాడు. నేను సంపాదించిన దాని కంటే ఎక్కువ టీసీఎస్‌కి చెల్లించాలి లేదంటే అతడితో కలిసి పనిచేయాలి’’ అని తన ఆవేదనని పంచుకున్నారు.

Show comments