Site icon NTV Telugu

Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తొలిరోజు భారత్ ఓడిపోయింది, విమానాలు కూలిపోయాయి: కాంగ్రెస్ మాజీ సీఎం.

Congress

Congress

Operation Sindoor: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పూణేలో మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ పూర్తి ఓటమిని చవిచూసిందని అన్నారు. 7వ తేదీని దాదాపు అరగంట పాటు జరిగిన వైమానిక యుద్ధంలో భారత్ ఓడిపోయిందని, కొన్ని విమానాలు కూలిపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. భారత వైమానిక దళం పూర్తిగా నిలిచిపోయిందని, ఒక్క విమానం కూడా ఎగరలేదని చెప్పారు. గ్వాలియర్, బటిండా, సిర్సా నుంచి ఏదైనా విమానం టేకాఫ్ అయితే, పాకిస్తాన్ కూల్చివేసే అవకాశం ఉందని, అందుకే వైమానిక దళం పూర్తిగా నేలకే పరిమితమైందని అన్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో ఆర్మీ ఒక్క కిలోమీటరు కూడా కదలలేదని, రెండు మూడు రోజులు జరిగిందంతా వైమానిక, క్షిపణి యుద్ధమే అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి యుద్ధాలే ఉంటాయని అన్నారు. యుద్ధం స్వభావం మారినప్పుడు, దేశానికి 1.2 మిలియన్ల సైనికులు అవసరమా? అని ప్రశ్నించారు.

ఆపరేషన్ సిందూర్ తొలి రోజు ఏం జరిగింది:

ఆపరేషన్ సిందూర్ తొలి రోజు భారత్ వైమానిక దళం పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలను నాశనం చేశాయి. పాక్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బలవల్పూర్‌లోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్‌ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. పీఓకేలోని మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు.

Exit mobile version