Site icon NTV Telugu

Rahul Gandhi: మేము “శక్తి”కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘హిందూ మతంలో ‘శక్తి’ అనే పదం ఉంటుంది. మేము ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ప్రశ్న ఏంటంటే, ఆ శక్తి ఏమిటి. ఈవీఎంలలో రాజు ఆత్మ ఉంది. ఇది నిజం. దేశంలోని ప్రతీ సంస్థలో ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్లలో రాజుగారి ఆత్మ ఉంది. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌ని వీడి మా అమ్మవద్ద ఏడ్చాడు. వారి పేరు నేను చెప్పదలుచుకోలేదు. సోనియాజీ, ఈ శక్తితో పోరాడే శక్తి నాకు లేనందుకు సిగ్గుపడుతున్నాను. నేను జైలుకు వెళ్లడం ఇష్టం లేదు. ఇలా వందలాది మంది భయపడ్డారు’’ అని అన్నారు.

Read Also: Bharat Jodo Nyay Yatra: ముంబై వేదికగా ఇండియా కూటమి బలప్రదర్శన.. ముగింపు సభకు కీలక నేతలు..

రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు శక్తి, మోడీజీకి ఆర్ఎస్ఎస్, మనువాదం రూపంలో ఉందని నేను చెబుతున్నానని, ఈ శక్తిని ఉపయోగించ మనల్ని కొట్టాలని చూస్తు్న్నారని ఖర్గే అన్నారు. వారు(బీజేపీ) ప్రతీ సారి 400 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారని, కర్ణాటకలో ఓ ఎంపీ తమకు మూడోంతుల మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారని, వారు దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు కోరుతున్నారని, వారు దేశాన్ని రక్షించేందుకు కాదని, పేదలకు వ్యతిరేకండా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కతం చేసేందుకు బీజేపీ చూస్తోదని ఆయన విమర్శించారు.

Exit mobile version