నైరుతీ రుతుపవనాల కారణంగా దేశంలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభణతో అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడికక్కడ రాకపోకలు చాలా కాలంపాటు బంద్ అయ్యాయి. దీంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read: ‘భయానక భవనం’ నిర్మిస్తానంటోన్న ‘బ్లాక్ విడో’!
గంటల వ్యవధిలోనే 145 మీమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అంతేకాదు, బీహార్ ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసం కూడా జలమయం అయింది. అధికారిక నివాసంలో ఒకటిన్నర అడుగుల మేర నీరు నిలిచిపోయింది. వరద నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్ అధికారులు శ్రమిస్తున్నారు.
