Child Pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరమే: సుప్రీం కోర్టు

  • పోక్సో చట్టం ప్రకారం ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోల నిల్వ నేరమన్న సుప్రీంకోర్టు..
  • ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని గతంలో మద్రాసు హైకోర్టు తీర్పు..
  • ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌..
  • ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని కోర్టు ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు ఆదేశం
Child

Child

Child Pornography: ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పును ఇచ్చింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Read Also: Sri Lanka vs New Zealand: రసవత్తర పోరులో విజయాన్ని అందుకున్న శ్రీలంక.. రెచ్చిపోయిన ప్రభాత్ జయసూరియ!

ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. అలాగే, పోక్సో చట్టం సెక్షన్‌ 15 ప్రకారం.. చైల్డ్‌ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను (ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొనింది. ఇక, ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగించాలని తెలిపింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దని సుప్రీం కోర్టు సూచనలు జారీ చేసింది.