Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే: సుప్రీం కోర్టు
- పోక్సో చట్టం ప్రకారం ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల నిల్వ నేరమన్న సుప్రీంకోర్టు..
- ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని గతంలో మద్రాసు హైకోర్టు తీర్పు..
- ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్..
- ఛైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని కోర్టు ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పును ఇచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Read Also: Sri Lanka vs New Zealand: రసవత్తర పోరులో విజయాన్ని అందుకున్న శ్రీలంక.. రెచ్చిపోయిన ప్రభాత్ జయసూరియ!
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. అలాగే, పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను (ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొనింది. ఇక, ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని తెలిపింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దని సుప్రీం కోర్టు సూచనలు జారీ చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!