Waqf board Bill: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభలో ఆందోళన చేశాయి. ప్రతిపక్షాలు ఇది క్రూరమైన, దేశాన్ని విభజించే ప్రయత్నం అంటూ మండిపడుతున్నాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించాయి. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలకు కేంద్రం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
Read Also: Owaisi: బీజేపీ ముస్లింలకు శత్రువు..దానికి ఈ బిల్లు నిదర్శనం..ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందని అన్నారు. కొత్త బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛకు భంగం కలిగించలేదని అన్నారు. వక్ఫ్ చట్టం, 1995ను ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి చట్టంగా పేరు మార్చాలని బిల్లు ప్రతిపాదించింది మరియు సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ ఈ బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛని హరించదు. ఎవరి హక్కుల్ని హరించదు. ఎవరైతే ఇప్పటి వరకు హక్కులు పొందలేదో వారికి హక్కుల్ని కల్పిస్తుంది’’అని అన్నారు. ఈ రోజు తీసుకువచ్చిన ఈ బిల్లును కాంగ్రెస్ హయాంతో సచార్ కమిటీ నివేదిక ఆధారంగా రూపొందించామని అన్నారు.