NTV Telugu Site icon

Waqf bill: రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..

Waqf Bill

Waqf Bill

Waqf bill: సోమవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వక్ఫ్ బిల్లుని ఆమోదించింది. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి నివేదికను సమర్పించారు. బిజినెస్ లిస్ట్ ప్రకారం.. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీ రిపోర్టుని హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో సభ ముందుంచనున్నారు. అంతకుముందు జనవరి 29న ముసాయిదా నివేదికను, సవరించిన బిల్లుని జేపీసీ ఆమోదించింది.

Read Also: Budget 2025 : బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రిని చుట్టుముట్టిన ఎంపీలు, ప్రధాని.. ఎందుకంటే ?

జేపీసీ మొత్తం 14 నిబంధనలలో 25 సవరణలతో వక్ఫ్ బిల్లు -1995కి సవరణలు చేసింది. అయితే, తమ అభిప్రాయాలను, సవరణలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జేపీపీ వ్యవహరించిందని కాంగ్రెస్‌తో సహా విపక్ష ఎంపీలు ఆరోపించారు. వక్ఫ్ ఆస్తుల్ని నియంత్రించడానికి 1995 వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే, ఇది అపరిమిత అధికారాలతో దుర్వినియోగం, అవినీతి, ఆక్రమణలు వంటి సమస్యలకు దారి తీసిందనే ఉద్దేశంతో బిల్లుని సవరించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇదిలా ఉంటే, ప్రతిపక్ష సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ బిల్లుపై తన అసమ్మతి నోట్‌లోని విభాగాలను తనకు తెలియకుండానే సవరించారని ఆరోపించారు. ప్రతిపక్ష గొంతులను అణిచివేసే ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ విమరణాత్మక అలసమ్మతి నోట్‌ని తాను సమర్పించానని, ఆశ్చర్యకరంగా నా అసమ్మతి నోట్‌లోని కొన్ని భాగాలను నాకు తెలియకుండానే సవరించారని అన్నారు.