NTV Telugu Site icon

Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..

D Fadnavis

D Fadnavis

Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ జిహాద్ నిజమైన ఫ్యాక్టర్. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. మోడీని తొలగించడమే వీరి లక్ష్యం. ఈ సారి అది పనిచేయదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.

Read Also: Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్..

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ కూటమి 17 సీట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్-శరద్ పవార్-ఉద్ధవ్ ఠాక్రే కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో మహా వికాస్ అఘాడి ఒక నకిలీ కథనాన్ని సృష్టించారు. మేము దానిని సూటిగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు తెలుసు. వారు (ప్రధాని నరేంద్ర) మోడీజీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చివేస్తారని, రిజర్వేషన్లను అంతం చేస్తారని అన్నారు. ప్రజలు మహావికాస్ అఘాడీకి ఓటేశారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లు తగ్గిస్తాం. వాటిని అంతం చేస్తామని అన్నారు’’ అని ఫడ్నవీస్ అన్నారు.

మహారాష్ట్రలో దళితుల ఓట్లు ముఖ్యమే కానీ, మహరాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఏ వర్గం కూడా ఎన్నికలను నిర్ణయించలేదని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యల వల్లే దళితులు మాకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు అలా జరగదని చెప్పారు. ఓ వర్గం మీడియా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నాయకుల విమర్శలపై మాత్రమే చూపిస్తుందని అన్నారు. అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. మీకు ముస్లింలు ఓటేస్తే ఓట్ జిహాద్ కాదు, మాకు ఓటేస్తే ఓట్ జిహాద్ అవుతుందా.? అని ప్రశ్నించారు.