NTV Telugu Site icon

Vodafone Idea: ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’తో వొడాఫోన్ ఐడియా చర్చలు..

Idea

Idea

Vodafone Idea: భారత టెలికాం దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఒప్పందాలు ప్రకటించాయి. ఇప్పటికే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ స్పేస్ ఎక్స్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కూడా స్టార్‌లింక్‌తో సహా వివిధ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లతో చర్చల్ని ప్రారంభించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది.

Read Also: Matthew Brownlee: 62ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం.. ఆయన ఎవరంటే?

ఈ వార్త రాగానే బుధవారం వొడాఫోన్ ఐడియా షేర్లు దాదాపుగా 5 శాతం పెరిగాయి. ‘‘ఎక్కడైతే శాటిలైట్ సేవలు సరిగ్గా సరిపోతాయో , కవరేజ్ లేని ఏరియాల్లో సేవల్ని అందించడం మా వ్యూహం’’ అని వోడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ అన్నారు. గతవారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారతదేశానికి తీసుకురావడానికి భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా, భారతీయ ఆపరేటర్లు స్టార్‌లింక్ పరికరాలను వారి రిటైల్ స్టోర్లలో అమ్ముతారు.