Putin To Visit India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ సందర్శిస్తారని క్రెమ్లిన్ ఈ రోజు తెలిపింది. మాస్కో-న్యూఢిల్లీలు షెడ్యూల్ ఖరారు చేసేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పుతిన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. అక్టోబర్ చివరలో బ్రిక్స్ సదస్సులో ఇరువురు నేతలు కలిశారు. ఈ పర్యటన సందర్భంగా పుతిన్‌ని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానం పంపారు.
Read Also: Ukraine War: అణ్వాయుధాల వినియోగానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్.. అమెరికాకి వార్నింగ్..
రష్యా-ఉక్రెయిన్ సమస్యని ప్రస్తావిస్తూ.. శాంతియుత పరిష్కారాన్ని భారత్ విశ్వసిస్తుందని మోడీ పుతిన్‌కి తెలియజేశారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి. వివాదానికి శాంతియుత పరిష్కారాలను మేము విశ్వసిస్తున్నాము. శాంతిని నెలకొల్పడానికి భారత్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.
ఈ ఏడాది ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా, ఉక్రెయిన్‌లో సందర్శించారు. ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శాంతి ప్రణాళికను మాస్కోకి పంపారు. అక్కడ పుతిన్‌తో దోవల్ సమావేశమయ్యారు. పుతిన్ భారత పర్యటనలో ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి ప్రణాళిక ప్రముఖంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.