Site icon NTV Telugu

Putin: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలకు పుతిన్ న్యూఇయర్ శుభాకాంక్షలు..

Putin, Modi

Putin, Modi

Vladimir Putin Sends ‘New Year’ Greetings To President Murmu, PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సందేశంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని.. ఇంధనం, సైనిక సాంతకేతికత, ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున వాణిజ్యం, ఆర్థిక ప్రాజెక్టులను నిర్వహించాలని కోరారు.

Read Also: Hospital Negligence: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి

జీ20, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) అధ్యక్షత బాధ్యతలను భారత్ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు పుతిన్. ఈ రెండు రష్యా-భారత్ ల మధ్య సహకారాన్ని మరింతగా నిర్మించడానికి కొత్త అవకాశాలను తెరుస్తాయని ఆకాంక్షించారు. 2022లో రష్యా, భారత్ 75 ఏళ్ల తమ దౌత్య సంబంధాల వార్షికోత్సవాలను జరుపుకున్నాయని.. స్నేహం, పరస్పర గౌరవాలపై రెండు దేశాల సంబంధాలు ఆధారపడ్డాయని అన్నారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం తరువాత భారతదేశం రష్యాతో వ్యాపార సంబంధాలను మరింతగా పెంచుకుంటోంది. ప్రపంచదేశాలు అడ్డు చెబుతున్నా రష్యా నుంచి భారత్ డిస్కౌంట్ పై చమురును కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై రష్యా దాడిని భారత్ విమర్శించలేదు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది.

Exit mobile version