NTV Telugu Site icon

Vivek Agnihotri: బాలీవుడ్‌కు ముస్లింల సహకారం.. శరద్ పవార్ వ్యాఖ్యలతో నా సందేహాలు తీరాయి..

Vivek Agnihotri

Vivek Agnihotri

Vivek Agnihotri’s key comments on Sharad Pawar’s comments: బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్ రాజుగా ఉన్నారని.. తయన పార్టీ పన్నులు వసూలు చేసేదని.. దానికి ప్రతిఫలంగా కొందరు సొంత రాజ్యాలను సృష్టించుకునేందుకు అనుమతి ఇచ్చారని ట్వీట్ చేశారు. చాలా మంది బాలీవుడ్ నుంచి ఎన్సీపీకి ఉదారంగా విరాళాాలు ఇచ్చారని.. ప్రతిగా వారు సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని.. ఆ వ్యక్తులు ఎవరని ఎప్పుడు నేను ఆలోచింస్తుండే వాడినని.. అయితే శరద్ పవార్ వ్యాఖ్యలతో నా సందేహాలు తీరాయని అన్నారు.

Read Also: MK Stalin: మరోసారి డీఎంకే అధినేతగా స్టాలిన్.. ఏకగ్రీవంగా ఎన్నిక

నాగ్‌పూర్‌లో విదర్భ ముస్లిం మేధావుల ఫోరమ్ నిర్వహించిన ‘ఇష్యూస్ బిఫోర్ ఇండియన్ ముస్లింస్’ అనే కార్యక్రమంలో శరద్ పవార్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఎదుగుదలకు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం అందిందని.. దీన్న ఎవరూ విస్మరించలేదరని శరద్ పవార్ అన్నారు. బాలీవుడ్ ను అగ్రస్థానాినికి తీసుకెళ్లడంతో ముస్లిం మైనారిటీలు అత్యధిక సహకారం అందించారని.. శరద్ పవార్ ఏ స్టార్ పేరును చెప్పకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు కళ అయినా.. రచన అయినా.. కవిత్వమైన అన్ని రంగాల్లో అత్యున్నత సహకారం మైనారిటీల నుంచి వచ్చిందని..ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నవారిలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఉన్నారు. తాను ఇటీవల తీసిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా భారీ విజయాన్ని సొంత చేసుకుంది. ఈ సినిమాను బీజేపీ పార్టీ స్వాగతించగా.. మరికొన్ని పార్టీలు ప్రజల మధ్య విభజనకు కారణం అవుతుందని విమర్శించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలు మాత్రం సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. బాలీవుడ్ లో రాజులు, బాద్షాలు, సుల్తానులు ఉన్నంత కాలం అది మునిగిపోతూనే ఉందని ఇటీవ వివేక్ అగ్నిహెత్రి కామెంట్స్ చేశారు. ప్రజల కథలతో బాలీవుడ్ ను ప్రజల పరిశ్రమగా మార్చండి.. ఇది ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను నడిపిస్తుందని ఆయన అన్నారు.

Show comments