Site icon NTV Telugu

Karnataka: టెన్త్ పరీక్షల్లో అంధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ… 566 మార్కులు తెచ్చుకున్న జాహ్నవి

Karnataka

Karnataka

కర్ణాటక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇద్దరు అంధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనుబరిచారు. మైసూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల్లో భారీగా మార్కులు సాధించారు. రంగారావు మెమోరియల్ స్కూల్ ఫర్ డిఫరెంట్ ఎబుల్డ్ విద్యార్థిని అయిన జాహ్నవి పుట్టుకతో అంధురాలు. అయితే తాజా ఫలితాల్లో 625 మార్కులకు గాను 566 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే మరొక అంధ విద్యార్థి మోహిత్ గౌడ కూడా అదే స్థాయిలో 511 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభను కనుబరించారు. జాహ్నవి తల్లి నందిని అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.

జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ.. తాను రోజుకి రెండు గంటలు మాత్రమే చదివానని.. ఇంత స్కోర్ ఊహించలేదని తెలిపింది. దృఢ నిశ్చయంతో చదవడంతోనే మంచి మార్కులు సాధించగలిగిందని జాహ్నవి తండ్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Crime: వివాహిత హత్య కేసులో కీలక పురోగతి.. వెలుగులోకి సంచలన విషయాలు

తిలక్ నగర్‌లోని ప్రభుత్వ బధిరులు మరియు అంధుల పాఠశాల విద్యార్థి మోహిత్ గౌడ 511 మార్కులు సాధించాడు. పుట్టుకతోనే మోహిత్ చూపు లేదు. మాండ్యలోని పాండవపుర తాలూకాకు చెందిన వాసి. పట్టుదలతో చదవడంతో మోహిత్ గౌడ మంచి మార్కులు సాధించారు. ఈ ఏడాది అంధ విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వడంతో నాయకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Minister Kondapalli: గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు..

Exit mobile version