Site icon NTV Telugu

Viral Video: ప్రియురాలిని కలిసేందుకు బురఖా ధరించిన యువకుడు.. చితక్కొట్టిన ప్రజలు..

Up

Up

Moradabad: గాఢమైన ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లి చావు దెబ్బలుతిన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. ప్రియుడు బురఖా ధరించి తన ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు. అయితే, స్థానికులకు అనుమానం రావడంతో బురఖా తీసేసి చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మొరాదాబాద్‌లో పట్టపగలే ఈ సంఘటన జరిగింది.

Read Also: TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”

పట్టుబడిన వ్యక్తిని చాంద్ భురాగా గుర్తించారు. బురఖా ధరించిన వ్యక్తి, పొరుగునే ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. అయితే, వ్యక్తి నడవడికపై అనుమానం కలిగిన స్థానికులు ముందుగా అతను పిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్‌గా భావించారు. బురఖా తొలగించి చూడగా అసలు విషయం తెలిసింది. అతడిని చుట్టుముట్టిన స్థానిక గుంపు అతడి ఆధార్ కార్డ్ చూపించమని అడగటం, అతడిని కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. పోలీసులకు సమాచారం ఇచ్చి, అతడిని అరెస్ట్ చేయించారు. యువకుడి వద్ద నుంచి పోలీసులు లైటర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/SachinGuptaUP/status/1830447613952278966

Exit mobile version