Viral Video: షాకింగ్ వీడియో.. బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా.. దుండగులను ఎలా తరిమికొట్టిందో చూశారా?

Haryana Woman Video

Haryana Woman Video

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ఓ వ్యక్తిపై దుండగులు తుపాకితో బుల్లెట్ల వర్షం కురిపిస్తుండగా ధైర్యంతో ఎదురుదాడి చేసిందో మహిళా. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా అవుతోంది. ఈ సంఘటన హర్యానాలోని భివానీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడి వచ్చారు.

Also Read: World Cup: ఫైనల్‌లో భారత్ ఓటమిపై సంబరాలు.. కాశ్మీరీ స్టూడెంట్స్‌పై “ఉపా” కేసు..

వెనక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు వాహనం దిగుతూనే ఇంటి ముందు నిలబడి ఉన్న వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో అతడు భయపడి ఇంట్లోకి వెళ్లి తప్పించుకున్నాడు. అదే సమయంలో ఓ మహిళా ఎదురు ఇంటి నుంచి వచ్చింది. ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న తుపాకులను సైతం ఏమాత్రం లెక్క చేయలేదు. ఓ పెద్ద కర్రతో దుండగులపై ఎదురు దాడికి ప్రయత్నించింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది.

Also Read: Free Tourist Visas: భారత్‌తో పాటు 6 దేశాలకు శ్రీలంక ‘ఉచిత టూరిస్ట్ వీసాలు’

ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, ఆ వ్యక్తి నాలుగు బుల్లెట్లతో గాయపడ్డారు. దీంతో అతడిని ఆస్పత్రి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆ మహిళా ధైర్యానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తుపాకులను సైతం లెక్క చేయని ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. అయితే ఘటనలో గాయపడిన వ్యక్తి ఇటీవల దారుణ హత్యకు గురైన రవి బాక్సార్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న హరికిషన్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లిన హరికిషన్ ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడు గ్యాంగ్‌స్టర్ భవ్య బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.