NTV Telugu Site icon

Viral Video: హే బాబు లేవు.. సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎగతాళి..

రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ.

Viral Video: ఈ రోజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం, ఎన్సీపీ(శరద్ పవార్) వంటి ఇండియా కూటమి పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి. అయితే, ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభకు వివరిస్తు్న్న సమయంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Man kills wife: పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి చంపిన భర్త..

సీరియస్‌గా కిరణ్ రిజిజు బిల్లులోని అంశాలను వివరిస్తుండగా, ఆయన పక్కన కూర్చున్న బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ రాహుల్ గాంధీ నిద్రపోతున్న దృశ్యాలనున చూసి ఎగతాళి చేయడం ప్రారంభించారు. ‘‘నిద్రపోతున్నాడు.. నిద్రపోతున్నాడు’’ అంటూ ఆయన ఎగతాళి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే, రాహుల్ గాంధీ నిద్రపోతున్నాడా.? లేదా.? అనే విషయం అస్పష్టంగా ఉంది.

గిరిరాజ్ సింగ్ పక్కనే ఉన్న బీజేపీ ఎంపీలు భూపేంద్ర యాదవ్, జితేంద్ర సింగ్‌తో సహా బీజేపీ ఎంపీలు నవ్వడం ప్రారంభించారు. ‘‘ప్రతీసారి చర్చ సందర్భంలో మాట్లాడవద్దని, మీకు నిద్ర వస్తుంది. అతడిని లేపండి’’ అంటూ కిరణ్ రిజిజు చమత్కరించారు. వక్ఫ్ సవరణ చట్టంలో మహిళకు బోర్డులో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు బోర్డు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే విధంగా, ముస్లింలలో ఇతర కమ్యూనిటీలకు చోటు కల్పించడానికి ఈ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. అయితే, ప్రతిపక్షాల నుంచి భారీ ఆందోళనలు రావడంతో దీనిని ‘‘జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ)’’కి పంపారు.

Show comments