NTV Telugu Site icon

Vinesh phogat: వినేష్ ఫోగట్‌కు నాడా నోటీసు.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెల్లడి

Vineshphogat

Vineshphogat

భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బుధవారం నోటీసు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు కారణంగా అనర్హత వేటుపడింది.  14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా క్రీడల నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించేసింది. రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో నమోదు చేసుకున్న అథ్లెట్లందరూ డోప్ పరీక్షల కోసం వారి వివరాలు అందించాల్సి ఉంటుంది. వివరాలు పూరించి.. ఆ సమయంలో ఆ ప్రదేశంలో అందుబాటులో లేకపోతే అది వైఫల్యంగా పరిగణించబడుతుంది. సోనెపట్‌లోని ఖర్ఖోడా గ్రామంలోని తన ఇంట్లో సెప్టెంబర్ 9న డోప్ టెస్ట్‌కు ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆచూకీ వైఫల్యానికి పాల్పడినట్లు నాడా తన నోటీసులో పేర్కొంది. దీనిపై నాడా క్లారిటీ కోరింది. మొత్తానికి వినేష్ ఫోగట్ నుంచి సమాచారాన్ని కోరింది. కానీ ఆమె మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తుందా? లేదంటే దాట వేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Mahindra Thar Roxx 4×4 Price: మహీంద్రా థార్ రాక్స్ 4×4 ధరలు వచ్చేశాయ్.. వేరియంట్ వైజ్ ధరలు ఇవే..

ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ విఫలమై భారత్‌కు చేరుకున్నాక.. వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాకుండా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి సీటు కూడా కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తాం