Site icon NTV Telugu

Vinesh Phogat: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ సర్కార్ బహుమానం.. ఎన్ని కోట్లంటే..!

Vineshphogat

Vineshphogat

మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు హర్యానా రాష్ట్ర క్రీడా విభాగం బహుమానం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండడంతో మూడు ఆప్షన్లు ఇచ్చింది. నగదు మరియు నివాసం లేదా గ్రూప్ ఏ ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చింది. మార్చి 25న జరిగిన కేబినెట్ సమావేశంలో జూలానా ఎమ్మెల్యే ఫోగట్‌కు క్రీడా విధానం కింద మూడు ఆప్షన్లు ఇచ్చేందుకు హర్యానా ప్రభుత్వం అంగీకరించింది.

తాజాగా ఆమె రూ.4 కోట్ల నగదు తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. ఈ డబ్బుతో కుటుంబ అవసరాలకు భూమిని కొనుగోలు చేసుకునేందుకు వీలు కలుగుతుందని కుటుంబ సభ్యుడు తెలిపారు.

వినేష్ ఫోగట్.. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. ఎక్కువ బరువు ఉన్నారన్న కారణంతో ఆమెపై వేటు పడింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం అయింది. అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరి.. 2024లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది.

Exit mobile version