Cow Dung: భారతీయ సంస్కృతిలో ఆవును గోమాతగా పూజిస్తారు.. ఇక, గోవు నుంచి లభించే పాలకే కాదు.. గోమూత్రానికి, గోవు పేడకు కూడా కొన్ని అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు.. ఆవు పేడను ఎరువుగా, బయోగ్యాస్ తయారీకి, నిర్మాణ సామగ్రిగా మరియు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. దీనికి దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉంది, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం మరియు ఇంధన అవసరాల కోసం ఆవు పేడ బాగా ఉపయోగ పడుతుంది.. అయితే, తమిళనాడులోని ఓ గ్రామంలో ఆవు పేడతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.. ఆ పేడను ఓ దగ్గర వేసి.. వాటిని పెద్ద ఉండలాగా తయారు చేసి.. కొట్టుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది..
Read Also: Bus Fire Accident: పూర్తి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సు.. వెలుగులోకి సంచలన విషయాలు..
తమిళనాడు – కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోని తాళవాడి అటవీ ప్రాంతంలో జరిగే ఒక విశేషమైన సంప్రదాయ ఉత్సవం ఇది.. దీపావళి తర్వాత మూడవ రోజు ప్రతి సంవత్సరం.. ఆవు పేడతో కొట్టుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు స్థానికులు.. దీంతో, ప్రతీ ఏడాది దీనిని నిష్టగా పాటిస్తారు.. దీనివల్ల పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, పిల్లలకు మంచి విద్యాబుద్దులు వస్తాయని.. అందరికీ మంచి జరుగుతుందనే నమ్మకం ఉండడంతో.. గ్రామంలో సేకరించిన ఆవు పేడను ఓ దగ్గర పోసి.. గ్రామస్తులు, యువకులు, పిల్లలు.. దాని చుట్టూ చేరి.. చేతులతో ముద్దలుగా చేసి.. ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు.. ఆవు పేడతో అలా కొట్టుకుంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో ప్రతీ ఏడాది దీపావళి తర్వాత ఓ ఉత్సవంగా దీనిని నిర్వహిస్తున్నారు ఆ గ్రామస్తులు..
