Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
- విజయ్ సీఎం కాకుండా ఆపింది ఆ ఒక్క తప్పే..
- గవర్నర్‌కు ఇచ్చిన లేఖతోనే సమస్య..
- అనుభవం లేకపోవడమే విజయ్ను దెబ్బతీసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ టీవీకే పార్టీకి అధికారం ఆమడదూరంలో ఉంది. విజయ్‌కి రాజకీయాలు కొత్త కావడం, అనుభవం ఉన్న నాయకుల మద్దతు లేకపోవడంతో విజయ్ తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కాబట్టి 107 స్థానాల బలమే టీవీకేకు ఉంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే విజయ్ పార్టీకి మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా, మ్యాజిక్ ఫిగర్ 118కి కన్నా దూరంగా 112 వద్దే మెజారిటీ ఆగిపోతోంది. మెజారిటీ కోసం మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం.
ఇలా చేసుంటే సీఎం అయ్యేవారు:
Also Read
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
ఇదిలా ఉంటే, ఈ అంకెల రాజకీయాలు ఇలా సాగుతుంటే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో విజయ్ అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ‘‘విజయ్ గవర్నర్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ సమర్పించిన లేఖ’’నే కారణం అని చెబుతున్నారు.
సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న పార్టీ నాయకుడు తమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటు హక్కును కోరుతారు. దీనికి గవర్నర్ అనుమతించి ఆ తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని చెబుతారు. అయితే, ఇక్కడ విజయ్ మాత్రం తన టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించారు. అప్పుడు కూడా బలం 112కు మాత్రమే చేరింది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. విజయ్ కాంగ్రెస్‌ను కలుపుకుని ‘‘కూటమి’’గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ భావించి ఉంటారు. అందుకే ముందు మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పారని విశ్లేషకులు చెబుతున్నారు.
అనుభవం లేకపోవడమే కారణం:
కేవలం అతిపెద్ద పార్టీ నాయకుడిగా గవర్నర్ ముందు విజయ్ క్లెయిమ్ చేసి ఉంటే, విజయ్ ఇప్పటికే సీఎం అయ్యేవారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి ఉండేవారు. మెరుగైన రాజకీయ సలహాదారుడు విజయ్ వెంట ఉండుంటే విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. విజయ్‌కి ఇదే తొలి ఎన్నికలు. స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేసిన అనుభవం టీవీకేకు లేదు. ప్రస్తుతం, టీవీకేలో అనుభవం ఉన్న వారు మాజీ అన్నాడీఎంకే నేత సెంగొట్టయాన్ మాత్రమే.
గవర్నర్ వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు:
ఇదిలా ఉంటే, గవర్నర్ వ్యవహారంపై మరికొందరు రాజకీయ నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్‌కు స్వతంత్ర నిర్ణయాధికారం ఉంటుందని చెబుతున్నారు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుగా ప్రీ-పోల్ కూటమి, తర్వాత అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?