తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గత 5 రోజులుగా మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో విజయ్ ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ అర్లేకర్ నిలిపేశారు. తాజాగా వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతుతో బలం 118కు చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
అయితే తాజాగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ మరో సంచలన లేఖ రాశారు. తమ దగ్గర 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ రాసినట్లు కథనాలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లోక్‌భవన్‌లో కలవబోతున్నట్లుగా లేఖలో విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక గవర్నర్‌ను కలిసిన అనంతరం సీపీఐ, వీసీకే నాయకులను కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా 121 ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు విజయ్ లేఖ రాయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వామపక్షాలు, వీసీకే కాకుండా ఇంకెవరూ మద్దతు ఇచ్చారని చర్చ నడుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి ఇంకెవరైనా మద్దతు ఇచ్చారా? అన్న చర్చ నడుస్తోంది. ఈ ఉత్కంఠ మరికొన్ని నిమిషాల్లో వీడిపోనుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే ప్రభుత్వంలో వీసీకేకు ఒక మంత్రి పదవి కేటాయించనున్నారు. అలాగే వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంకు చెరో మంత్రి పదవి ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తిరుచ్చి ఈస్ట్ తమకు ఇవ్వాలని వీసీకే షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది.
CPI and CPI(M) extend unconditional support to TVK for the formation of government in Tamil Nadu. pic.twitter.com/3CVFXTAzcB
— ANI (@ANI) May 8, 2026
