Site icon NTV Telugu

Viral Video: లవ్ ఎఫైర్.. యువకుడికి సగం గుండు, చెప్పుల దండతో ఊరేగింపు..

Up

Up

Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు. అమ్రోహా జిల్లాలో ఈ అవమానకరమైన ఘటన జరిగింది. యువకుడి మొహానికి నల్లరంగు పూసి, సగం గుండు కొరిగించి, మెడలో చెప్పు దండ వేసి ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ అబ్బాయి చేసిన పని ఏంటంటే, ఆ గ్రామంలోని ఒక అమ్మాయిని ప్రేమించడమే. ఈ వ్యవహారంలో యువకుడికి అత్యంత దారుణమైన శిక్ష విధించారు.

అమ్రోహ్ జిల్లా నౌగావాన్‌లోని ఖేడా అప్రోలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పంచాయతీ ఈ శిక్షను విధించి, అమలు చేసింది. గ్రామంలోని ఓ బాలికతో యువకుడు మాట్లాడుతుండగా, తమ కూతురితో మాట్లాడినందుకు యువతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం పంచాయతీకి చేరింది. పంచాయతీ వారు యువకుడికి కఠిన శిక్ష విధించారు.

Read Also: Deputy CM Pawan Kalyan: గ్రామీణ రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. యువకుడిని గ్రామంలోని అన్ని వీధుల గుండా ఊరేగిస్తుంటే, పిల్లలు అతడిని ఎగతాళి చేయడం వీడియోలో కనిపించింది. యువకుడి తన సగం షేవ్ చేయబడింది, అతని ముఖానికి సిరా నల్లగా చేశారు, మెడలో చెప్పుల దండ కూడా కనిపిస్తుంది. యువతి కుటుంబీకులు అతడిని దారుణంగా కొట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేశామని, ఒకే వర్గానకి చెందిన ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. వీడియో గురువారం మధ్యాహ్నం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Exit mobile version