Bengaluru: రైడ్ క్యాన్సిల్.. ఆటో డ్రైవర్, యువతి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్..
- యువతి, ఆటో డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం..
- రైడ్ క్యాన్సిల్‌తో వివాదం..
- వైరల్ వీడియోపై స్పందించిన బెంగళూర్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: ఒక యువతి, ఆటో డ్రైవర్‌కి జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు యువతి ఒకేసారి రెండు ఆటోలను బుక్ చేసి, చివరి నిమిషంలో ఒక దానిని క్యాన్సిల్ చేసినట్లు ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన బెంగళూర్‌లో జరిగింది. అయితే, తాను బుక్ చేయలేదని యువతి, ఆటో డ్రైవర్ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒకానొక సమయంలో యువతి ఆవేశంతో ఆటో డ్రైవర్ని దుర్భాషలాడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆటో డ్రైవర్ తన కెమెరాలో బంధించారు.
రెండు వేర్వేరు యాప్స్‌తో యువతి ఒకే సారి రెండు ఆటోలను బుక్ చేసినట్లు ఆరోపించబడింది. ‘‘ చాలా సేపటి నుంచి ఇక్కడే ఎదురుచూస్తున్నాను. మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వేరే ఆటో ఎక్కి వెళ్తున్నారు. ఆటో డ్రైవర్లను ఏం చేయాలనుకుంటున్నారు..? అని అతడు అడగడం కనిపించింది.
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
దీనికి ప్రతిస్పందనగా యువతి మాట్లాడుతూ.. తాను ఆటోని బుక్ చేసుకోలేదని కేవలం ధరల్ని మాత్రమే పోల్చి చూశానని చెప్పింది. అయితే, ఆమె ఓలా ద్వారా తన ఆటో బుక్ చేసిందని డ్రైవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో యువతి తాను ఎక్కిన ఆటో డ్రైవర్ని పోనివ్వాలని కోరడం వీడియోలో కనిపించింది. “నేను రెండు ఆటోలు బుక్ చేయలేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నావు? నేను రెండు వేర్వేరు ఆటోలలో ధరలను తనిఖీ చేసాను మరియు ఒకటి బుక్ చేసాను. మీకు కాల్ వస్తే, అప్పుడు ఇది యాప్ సమస్య, దయచేసి నన్ను వదిలివేయండి మరియు నన్ను వేధించవద్దు” అని మహిళ చెప్పింది.
Read Also: Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..
ఈ ఘటనపై బెంగళూర్ పోలీసులు స్పందించారు. ఈ వైరల్ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ‘‘దయచేసి మీ సంప్రదింపు నెంబర్ని డైరెక్ట్ మెసేజ్ చేయండి, సంఘటన జరిగి స్థలాన్ని తెలియజేయండి’’ అని కోరారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. “యాప్‌లో క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. రైడ్లను రద్దు చేసే హక్కు ప్రతి రైడర్‌కు ఉంటుంది. ఆటో డ్రైవర్‌కు ఏవైనా సమస్యలు ఉంటే సర్వీస్ ప్రొవైడర్‌తో చెక్ చేయవచ్చు. డ్రైవర్ నిరసనగా యాప్‌ను తొలగించవచ్చు. రోడ్డుపై కన్నడేతర అమ్మాయిని వేధించడం నైతికంగా లేదు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మరొకరు ‘‘ఆటో రైడ్‌ను రద్దు చేయడం నేరం కానప్పటికీ, అలాంటి పదాలు ఉపయోగించడం మరియు ఒకరిని కొట్టడం. పోలీసులు దీనిపై విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఒక కంపెనీ యాప్‌లో క్యాన్సిల్ ఫీచర్‌ని ఇచ్చినప్పుడు, దానిని ఉపయోగించే కస్టమర్‌ని ఎందుకు నిందించాలి..? వారు రద్దు చేసుకున్నప్పుడు డ్రైవర్ని నిందించండి.’’ అని మరోకరు రాశారు.
ಪ್ರಯಾಣಿಕರು ಚಾಲಕನಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಅಸಭ್ಯ ಮತ್ತು ಅವಾಚ್ಯ ಪದಗಳನ್ನು ಕಾನೂನಾತ್ಮಕವಾಗಿ ಬಳಸುವುದು ಎಷ್ಟು ಸರಿ.??@BlrCityPolice @blrcitytraffic @ITBTGoK @PMOIndia @tdkarnataka @tv9kannada @CMofKarnataka @DCPNEBCP @DgpKarnataka @prajavani @DgpKarnataka @News18Kannada @NewsFirstKan @PoliceBangalore pic.twitter.com/0WqtdpRYEy
— pavan kumar (@pavanku51441725) November 14, 2024
తాజావార్తలు
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!