NTV Telugu Site icon

Bengaluru: రైడ్ క్యాన్సిల్.. ఆటో డ్రైవర్, యువతి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్..

Bengaluru

Bengaluru

Bengaluru: ఒక యువతి, ఆటో డ్రైవర్‌కి జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు యువతి ఒకేసారి రెండు ఆటోలను బుక్ చేసి, చివరి నిమిషంలో ఒక దానిని క్యాన్సిల్ చేసినట్లు ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన బెంగళూర్‌లో జరిగింది. అయితే, తాను బుక్ చేయలేదని యువతి, ఆటో డ్రైవర్ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒకానొక సమయంలో యువతి ఆవేశంతో ఆటో డ్రైవర్‌ని దుర్భాషలాడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆటో డ్రైవర్ తన కెమెరాలో బంధించారు.

రెండు వేర్వేరు యాప్స్‌తో యువతి ఒకే సారి రెండు ఆటోలను బుక్ చేసినట్లు ఆరోపించబడింది. ‘‘ చాలా సేపటి నుంచి ఇక్కడే ఎదురుచూస్తున్నాను. మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వేరే ఆటో ఎక్కి వెళ్తున్నారు. ఆటో డ్రైవర్లను ఏం చేయాలనుకుంటున్నారు..? అని అతడు అడగడం కనిపించింది.

దీనికి ప్రతిస్పందనగా యువతి మాట్లాడుతూ.. తాను ఆటోని బుక్ చేసుకోలేదని కేవలం ధరల్ని మాత్రమే పోల్చి చూశానని చెప్పింది. అయితే, ఆమె ఓలా ద్వారా తన ఆటో బుక్ చేసిందని డ్రైవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో యువతి తాను ఎక్కిన ఆటో డ్రైవర్‌ని పోనివ్వాలని కోరడం వీడియోలో కనిపించింది. “నేను రెండు ఆటోలు బుక్ చేయలేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నావు? నేను రెండు వేర్వేరు ఆటోలలో ధరలను తనిఖీ చేసాను మరియు ఒకటి బుక్ చేసాను. మీకు కాల్ వస్తే, అప్పుడు ఇది యాప్ సమస్య, దయచేసి నన్ను వదిలివేయండి మరియు నన్ను వేధించవద్దు” అని మహిళ చెప్పింది.

Read Also: Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..

ఈ ఘటనపై బెంగళూర్ పోలీసులు స్పందించారు. ఈ వైరల్ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ‘‘దయచేసి మీ సంప్రదింపు నెంబర్‌ని డైరెక్ట్ మెసేజ్ చేయండి, సంఘటన జరిగి స్థలాన్ని తెలియజేయండి’’ అని కోరారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. “యాప్‌లో క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. రైడ్‌లను రద్దు చేసే హక్కు ప్రతి రైడర్‌కు ఉంటుంది. ఆటో డ్రైవర్‌కు ఏవైనా సమస్యలు ఉంటే సర్వీస్ ప్రొవైడర్‌తో చెక్ చేయవచ్చు. డ్రైవర్ నిరసనగా యాప్‌ను తొలగించవచ్చు. రోడ్డుపై కన్నడేతర అమ్మాయిని వేధించడం నైతికంగా లేదు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మరొకరు ‘‘ఆటో రైడ్‌ను రద్దు చేయడం నేరం కానప్పటికీ, అలాంటి పదాలు ఉపయోగించడం మరియు ఒకరిని కొట్టడం. పోలీసులు దీనిపై విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఒక కంపెనీ యాప్‌లో క్యాన్సిల్ ఫీచర్‌ని ఇచ్చినప్పుడు, దానిని ఉపయోగించే కస్టమర్‌ని ఎందుకు నిందించాలి..? వారు రద్దు చేసుకున్నప్పుడు డ్రైవర్‌ని నిందించండి.’’ అని మరోకరు రాశారు.

Show comments