Site icon NTV Telugu

Vande Bharat: వందేభారత్ ఆహారంలో దుర్వాసన.. ప్రయాణికుడి పోస్టుకు స్పందించిన రైల్వేశాఖ..

Vande Bharat

Vande Bharat

Vande Bharat: తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇటీవల ప్రయాణికులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో కూడిన ఈ ట్రైన్లలో ఫుడ్ మాత్రం అంత నాణ్యతగా ఉండటం లేదు. గతంలో పలువురు ప్రయాణికులు ఆహారం విషయమై ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రైలులో ఇచ్చిన భోజనం దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ అనుభవం ఎదురైంది.

Read Also: Covid Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో 514 కేసులు..

దీనిపై ఆగ్రహంగా ఉన్న ఆకాశ్ కేసరి ఎక్స్(ట్విట్టర్)లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హాయ్ సార్ నాకు అందించిన ఆహారం దుర్వాసనతో పాటు చాలా మురికిగా ఉంది. దయచేసి నా డబ్బునున తిరిగి ఇవ్వండి.. ఈ ఆహార విక్రేతలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ పేరును పాడు చేస్తున్నారు’’ అంటూ ఫుడ్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇండియన్ రైల్వే, వందేభారత్ ఎక్స్‌ప్రెస్, రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్‌‌ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

దీనిపై భారత రైల్వే స్పందించింది. రైల్ మదద్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయబడిందని, ఫిర్యాదు నంబర్ మీ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ ద్వారా పంపించబడిందని, తదుపరి సాయం కోసం డైరెక్ట్ మెసేజ్(డీఎం) ద్వారా పీఎన్ఆర్, మొబైల్ నెంబర్ పంచుకోవాలని ప్రయాణికుడిని కోరింది. దీనిపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) స్పందిస్తూ.. అసౌకర్యానికి చింతిస్తున్నామని, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Exit mobile version