iPhone: ఐఫోన్‌కి ఉన్న క్రేజే వేరు, అప్పులు చేసైనా ఆ ఫోన్ కొనాలనుకునేవారు చాలా మందే ఉంటారు. తల్లిదండ్రులను వారి స్థోమత గురించి ఆలోచించకుండా పిల్లలు ఐఫోన్ కావాలని కోరుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఐఫోన్ కోసం తల్లిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వైరల్‌గా మారింది. ఐఫోన్ కోసం మూడు రోజులు అన్నం తినకుండా తల్లిని బ్లాక్‌మెయిల్ చేశాడు. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే తన తల్లి గురించి ఆలోచించకుండా ఆ కొడుకు ఐఫోన్ కోసం ప్రవర్తించిన తీరుని అందరూ విమర్శిస్తున్నారు.
Read Also: Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ.. 14 ఏళ్ల తర్వాత..
చివరకు కొడుకుపై ప్రేమతో ఆ తల్లి ఐఫోన్ కొనిచ్చిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ తల్లి తన కొడుకుని తీసుకుని మొబైల్ షోరూంకి వచ్చి ఐఫోన్ కొనిచ్చినట్లు వీడియోలో కనిపిస్తొంది. ఐఫోన్ కొనడానికి వచ్చిన కస్టమర్ల ద్వారా తన షాపుని ప్రమోట్ చేసుకోవానుకున్న షాప్ యజమాని తల్లీకొడుకుల వీడియోను రికార్డ్ చేశాడు.
తన తల్లి గుడి ముందు పూలు అమ్ముతుందని బాలుడు చెప్పాడు. అతని తల్లి కూడా ఇదే విషయాన్ని చెబుతూ, మూడు రోజుల నుంచి అన్నం తినలేదని చివరకు ఐఫోన్ కొనివ్వాల్సి వచ్చిందని చెప్పింది. అయితే, తన కొడుకు కోరిక తీర్చినందుకు ఓ వైపు సంతోషం వ్యక్తం చేస్తూనే, మరోవైపు తన భావోద్వేగాన్ని అణుచుకోవడం కనిపిస్తోంది. అయితే, ఇంటర్నెట్‌లో కొడుకుతో పాటు ఈ వీడియోని రికార్డ్ చేసిన వ్యక్తిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. తన తల్లి కష్టాన్ని అర్థం చేసుకోని వాడు ఎలా కొడుకు అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ఒక వినియోగదారుడి భావోద్వేగాన్ని రికార్డు చేసి ప్రచారం చేసుకుంటున్న దుకాణదారుడిపై కూడా మండిపడుతున్నారు.
This Guy stopped eating food and was demanding iPhone from her mother, His mother finally relented and gave him money to buy iPhone. She sells flowers outside a mandir.
pic.twitter.com/CS59FAS4Z4— Ghar Ke Kalesh (@gharkekalesh) August 18, 2024
