NTV Telugu Site icon

Vande Bharat: వందే భారత్ రైలు పైకప్పు నుంచి నీరు.. వీడియో వైరల్

Vandie Bharth

Vandie Bharth

వందే భారత్ రైలుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్ పైకప్పు నుంచి నీరు ధారలా కారిపోతుంది. దీంతో ప్రయాణికులు సీట్లో కూర్చోలేని దుస్థితి ఏర్పడింది. భారీగా నగదు చెల్లించి టికెట్ తీసుకుని.. సీట్లో కూర్చునే అవకాశం లేకుండా పోయింది. నిలబడి ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంత మంది ప్యాసింజర్స్.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Chicken Biryani : బిర్యానీ ఆర్డర్ చేస్తే.. మంచూరియా ఇచ్చిన సిబ్బంది.. ఇదేమని అడుగుతే దంపతులపై దాడి..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు  ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తోంది. ఓ బోగీలో పైకప్పు నుంచి  నీరు లీక్ అయింది. వాటర్ బోగీ అంతా వ్యాపించింది. అంతేకాకుండా సీట్లు కూడా తడిసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కింద బ్యాగ్‌లు తడిచిపోయే పరిస్థితి.. సీట్లో కూర్చుంటే బట్టలు తడిసిపోయే దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. అంతేకాకుండా రైల్వే శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. రైల్వేశాఖ నిర్వహణ సరిగా లేదని విమర్శలు గుప్పించారు. ఇండియాలో టాప్ రైళ్లలో ఒకటైన వందే భారత్ రైల్లో పైకప్పు నుంచి నీరు కారుతుందని.. రైలు నెంబర్ 22416లో ఢిల్లీ -వారణాసి వెళ్తుండగా ఈ పరిస్థితి ఏర్పడిందని పోస్టులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Health Insurance Buying: ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాలిసిందే..

ఈ వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించింది. మరమ్మత్తులు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు.. రైల్వేశాఖపై విమర్శలు గుప్పించారు.