Site icon NTV Telugu

Video: నిలబడి ఉండగానే గుండెపోటుతో శివసేన నేత కుమారుడు మృతి

Senaleaderraghunathson

Senaleaderraghunathson

శివసేన నేత (యూబీటీ) రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోర్ గుండెపోటుతో మృతి చెందారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్‌తో గొడవ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Cold: వానాకాలంలో జలుబు తగ్గాలంటే ఇలా చేయండి

ప్రాథమిక నివేదిక ప్రకారం వీరంతా విరార్‌లోని సెవెన్ సీ రిసార్ట్‌కు వెళ్లారు. పార్కింగ్ సమస్యపై గొడవ జరిగింది. అనంతరం గుండెపోటుతో మిలింద్ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి కారు బానెట్‌కి ఆనుకుని నేలపై కుప్పకూలినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్‌కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్

మిలింద్ మోరే(45), శివసేన మాజీ థానే జిల్లా చీఫ్ రఘునాథ్ మోరే కుమారుడు. మిలింద్ మోరే శివసేన థానే యూనిట్‌కి డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినప్పుడు మిలింద్ మోర్ తన కుటుంబంతో కలిసి నవాపూర్‌లోని రిసార్ట్‌లో ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయంత్ బజ్‌బాలేను పేర్కొన్నారు.

 

Exit mobile version