Site icon NTV Telugu

Viral video: కారు రన్నింగ్‌లో ఉండగా మహిళలు డ్యాన్సులు.. పోలీసులు ఏం చేశారంటే..!

Upvideoviral

Upvideoviral

ఈ మధ్య యువతరం చేస్తున్న చేష్టలు భయాందోళన కలిగిస్తు్న్నాయి. సోషల్ మీడియాలో ఫేయస్‌ కోసమో.. వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబైలో రీల్స్ చేస్తూ ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఒక యువకుడు.. పెట్రోల్ ట్యాంక్‌పై చిన్న పిల్లాడ్ని పెట్టుకుని బైక్‌పై డేంజరస్ స్టంట్స్ చేసిన సంఘటనలు కలకలం రేపాయి. తాజాగా ఇద్దరు మహిళలు.. కారు డ్రైవింగ్ చేస్తూ డ్యాన్స్‌లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ

ఘజియాబాద్‌- ఢిల్లీ జాతీయ రహదారిలో ఎస్‌యూవీ కారు నడుపుతూ ఇద్దరు మహిళలు డ్యాన్స్‌లు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా యూపీ పోలీసులు ఘజియాబాద్ పోలీసులను ఆదేశించారు. ఓ సినిమా పాటకు ఇద్దరు మైమరిచి డ్యాన్సులు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల ప్రాణాలు పోతాయని వాపోయారు. మహిళలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: రాజకీయ నేతలు పానీపూరి అమ్ముకోవాలా..? శంకరాచార్య వ్యాఖ్యలపై కంగనా ఫైర్..

Exit mobile version