NTV Telugu Site icon

UP Video: అమానుషం.. బైక్‌పై వెళ్తున్న యువతిని టార్చర్ చేసిన పోకిరీలు

Upwomanvideo

Upwomanvideo

యోగి ఇలాకాలో పోకిరీలు రెచ్చిపోయారు. బుల్డోజర్ ప్రభుత్వం ఉందన్న సంగతి మరిచిపోయి ఆకతాయిలు చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయారు. వరద నీటిలో అతికష్టం మీద బైక్‌పై యువతీయువకుడు వస్తుంటే.. వారిపై ఓ గుంపు ఇష్టానురీతిగా నీళ్లు పోస్తూ.. కిందపడేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Hyderabad Crime: ఎఫ్‌బీలో పరిచయం.. హైదరాబాద్‌కు పిలిచి అత్యాచారం..! ఘటన వెనుక విస్తుపోయే వాస్తవాలు..

వరద నీటిలో రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న యువతీయువకుడిపై కొందరు యువకులు వేధింపులకు గురిచేశారు.
తాజ్ హోటల్ బ్రిడ్జి కింద కొందరు బైక్‌ను చుట్టుముట్టి నీళ్లు వారిపై పోశారు. ఇంకొందరు బైక్ ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగడంతో కిందపడిపోయారు. అంతేకాకుండా ఆ యువతిని ఒక కుర్రాడు చేతులతో తాకడం కనిపించింది. అయితే ఈ ఘటనను బిల్డింగ్ పైనుంచి మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. కేసు నమోదు చేసి మహిళను వేధించిన పోకిరీలను వెతికే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి: Pakistan: పరువు హత్య.. ప్రేమ వ్యవహారం అనుమానంతో భార్య సజీవదహనం