PM Modi: నవరాత్రి వేళ ప్రధాని రాసిన “గర్బా” సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ‘గర్భా’ సాంగ్ రిలీజైంది. ముఖ్యంగా గుజరాతీలు శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యువతీయువకులు సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’ చేస్తారు. దీంట్లో భాగంగా గర్బా పాటల ఆల్బమ్ రిలీజైంది. ఈ పాటను ప్రధాని నరేంద్రమోడీ రాయడం విశేషం. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో ఈ వెల్లడించారు.
190 సెకన్ల నిడివి గలిగిన ‘గర్బో’ పేరుతో ఈ మ్యూజిక్ వీడియో శనివారం విడుదలైంది. ఈ పాటను ధ్వని భానుశాలి పాడగా.. తనిష్క్ బాగ్చి సంగీరాన్ని సమకూర్చారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై ఈ పాట విడుదలైంది.
Also Read
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023
కంపెనీ ఈ పాటను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. దీనిని ఎవరో కాదు మన ప్రధాని నరేంద్రమోడీ రాసిన నుంచి ప్రేరణ పొందిందని, నవరాత్రి సమయంలో గుజరాత్ సంస్కృతిని గర్బో సాంగ్ ప్రతిబింభిస్తుందని కామెంట్ చేసింది. ఈ పాట ఆన్లైన్ లో రికార్డ్ సృష్టిస్తోంది. విడుదలైన 6 గంటల్లోనే యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
గర్బో పాటలో భాగస్వామ్యం అయిన అందరికీ ప్రధాని నరేంద్రమోడీ థాంక్స్ చెప్పారు. చాలా ఏళ్ల క్రితం ఈ పాట రాసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇది అనేక జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చిందని, చాలా సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేదని, అయితే కొన్ని రోజుల క్రితం ఒక కొత్త గర్బా పాట రాసినట్లు చెప్పారు. ఈ నవరాత్రి సందర్భంగా విడుదల చేస్తానన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!