NTV Telugu Site icon

PM Modi: నవరాత్రి వేళ ప్రధాని రాసిన “గర్బా” సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న వీడియో..

Pm Modi

Pm Modi

PM Modi: నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ‘గర్భా’ సాంగ్ రిలీజైంది. ముఖ్యంగా గుజరాతీలు శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యువతీయువకులు సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’ చేస్తారు. దీంట్లో భాగంగా గర్బా పాటల ఆల్బమ్ రిలీజైంది. ఈ పాటను ప్రధాని నరేంద్రమోడీ రాయడం విశేషం. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో ఈ వెల్లడించారు.

190 సెకన్ల నిడివి గలిగిన ‘గర్బో’ పేరుతో ఈ మ్యూజిక్ వీడియో శనివారం విడుదలైంది. ఈ పాటను ధ్వని భానుశాలి పాడగా.. తనిష్క్ బాగ్చి సంగీరాన్ని సమకూర్చారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై ఈ పాట విడుదలైంది.

Read Also: Sanjay Raut: పాక్ క్రికెట్ టీంకు ఘన స్వాగతంపై శివసేన ఎంపీ ఫైర్.. ‘బాలాసాహెబ్ ఠాక్రేని గుర్తుకు తెస్తూ’..

కంపెనీ ఈ పాటను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. దీనిని ఎవరో కాదు మన ప్రధాని నరేంద్రమోడీ రాసిన నుంచి ప్రేరణ పొందిందని, నవరాత్రి సమయంలో గుజరాత్ సంస్కృతిని గర్బో సాంగ్ ప్రతిబింభిస్తుందని కామెంట్ చేసింది. ఈ పాట ఆన్‌లైన్ లో రికార్డ్ సృష్టిస్తోంది. విడుదలైన 6 గంటల్లోనే యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

గర్బో పాటలో భాగస్వామ్యం అయిన అందరికీ ప్రధాని నరేంద్రమోడీ థాంక్స్ చెప్పారు. చాలా ఏళ్ల క్రితం ఈ పాట రాసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇది అనేక జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చిందని, చాలా సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేదని, అయితే కొన్ని రోజుల క్రితం ఒక కొత్త గర్బా పాట రాసినట్లు చెప్పారు. ఈ నవరాత్రి సందర్భంగా విడుదల చేస్తానన్నారు.