NTV Telugu Site icon

Maharashtra video: పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేత వీరంగం.. మహిళపై దాడి

Maharashtravideo

Maharashtravideo

మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ అధికార ప్రతినిధి సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు షేర్ చేశారు. మహారాష్ట్రలోని బుల్దానాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Hero Weight Loss: ఇదిరా డెడికేషన్ అంటే.. సినిమా కోసం 18 కేజీల బరువు తగ్గిన హీరో

మహారాష్ట్రలోని బుల్దానాలో బీజేపీ నేత, మల్కాపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ శివ తైడే పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళపై అమాంతంగా దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్టేషన్‌లో జరిగిన సంఘటనా దృశ్యాలను శివసేన యూబీటీ నేత సుష్మా అంధారే సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంగళవారం ఉదయం ఒక జంట పోలీస్ స్టేషన్‌లో బెంచ్‌పై కూర్చున్నారు. బీజేపీ నాయకుడు తైడే మహిళను చెంపదెబ్బ కొట్టాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కొడుతూనే ఉన్నాడు. అసలు గొడవేంటో తెలియదు గానీ.. ఒక మహిళ అధిక స్వరంతో చర్చించినట్లు వీడియోలో కనిపించింది. ఇది భార్యాభర్తల పంచాయితీగా కనిపిస్తోంది. సుష్మా అంధారే.. ఉప ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..