Hero Weight Loss: ఇదిరా డెడికేషన్ అంటే.. సినిమా కోసం 18 కేజీల బరువు తగ్గిన హీరో
- సినిమా కోసం బరువు తగ్గిన హీరో
- రెండు నెలల్లో అన్ని కేజీలు బరువు తగ్గడంతో ఆశ్చర్య పోతున్నా ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero lost 18 kg weight for the film: హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “డబుల్ ఇస్మార్ట్”. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద జనాలలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంతకు ముందు వీళ్ళ ఇద్దరి కాంబోలో వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్, యాక్షన్, డ్రామా మరియు వినోదం యొక్క డబుల్ డోస్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొత్తం ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్ కోసం పెద్ద రిలీజే ప్లాన్ చేశారు.
Also Read: Harish Rao: రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి..
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్ – ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అలీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ రీసెంట్ గ వైజాగ్ లో ట్రైలర్ లంచ్ చేసారు. ట్రైలర్ పైన మంచి స్పందన రావడంతో ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాలు గురించి హీరో రామ్ చెప్పుకొచ్చారు. సినిమా ప్రమోషన్ భాగంగా గెటప్ శ్రీనుతో ఇంటర్వ్యూ లో హీరో రామ్ కొన్ని విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలో క్లైమాక్స్ కోసం బరువు తగ్గాలని డైరెక్టర్ చెప్పారని దానికోసం బాలీ వెళ్లి రెండు నెలల్లో 86 నుండి 68 కేజీలు బరువు తగ్గాను అంటు చెప్పుకొచ్చారు. ఇక సినిమాకోసం హీరో రామ్ డెడికేషన్ చూసి ఫాన్స్ అంత ఆశ్చర్య పోతున్నారు.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!