NTV Telugu Site icon

Bihar: తెప్పపై నది దాటుతుండగా ప్రమాదం.. వీడియో వైరల్

Viralvideo

Viralvideo

బీహార్‌లోని పుర్నియా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది తెప్పపై వెళ్తున్నారు. హఠాత్తుగా అది అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో తెప్పపై ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: Delhi: గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు సన్నాహాలు! ఏఏ రాష్ట్రాలంటే..!

నదిపై వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేసుకున్నారు. దీనిపై పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు. తెప్పను తాడు సాయంతో అవతలి ఒడ్డువైపు లాగేందుకు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అధిక బరువు కారణంగా ఆ తెప్ప అదుపుతప్పింది. నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోటు ఒక్కసారిగా కదలడంతో ప్రయాణికులు బ్యాలెన్స్ సరిగాలేక నదిలో పడిపోయారు. అయితే తెప్పపై ఉన్న వారందరినీ రక్షించామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.