NTV Telugu Site icon

Jagdeep Dhankhar: ఎయిమ్స్ నుంచి ఉప రాష్ట్రపతి డిశ్చార్జ్

Jagdeepdhankhar

Jagdeepdhankhar

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడ్డారు. దీంతో హుటాహుటినా ఆయన్ను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఎయిమ్స్)కు తరలించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదిటపడడంతో వైద్యులు సోమవారం డిశ్చార్జ్ చేశారు.

ఇది కూడా చదవండి: Chittoor Crime News: చిత్తూరు కాల్పుల ఘటన.. దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి!

ఇక జగదీప్ ధన్‌కర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం జగదీప్ ధన్‌కర్ ఆరోగ్యంగా ఉన్నారని.. అయితే కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఎయిమ్స్ వైద్యులు సూచించారు.