Site icon NTV Telugu

Big Breaking: ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల

Vice President Election Schedule

Vice President Election Schedule

కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసింది. జులై 7వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నామినేషన్లను జులై 20వ తేదీన పరిశీలించనున్నారు. ఎవరైనా నామినేషన్లను ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే.. జులై 22వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉండనుంది. అదే రోజే కౌంటింగ్ చేయనున్నారు. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ జరగనుంది.

Exit mobile version