సోషల్ మీడియాలో రోజురోజుకీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు.. ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు.. తను కష్టాల్లో ఉన్నాను.. ఆర్థిక సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టి.. తప్పుడు నెంబర్లతో గుల్ల చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అలా డబ్బులు ఇచ్చి ఎంతో మందా మోసపోయారు.. అయితే, ప్రముఖులను సైతం వదలడంలేదు కేటుగాళ్లు.. ఏకంగా భారత ఉపరాష్ట్రపతి పేరుతో ఫేక్ మేసేజ్‌లు పెడుతున్నారు..
Read Also: Ramzan 2022: ముస్లిం సోదరులకు 29న సర్కార్ ఇఫ్తార్ విందు..
ఆర్థికసాయం చేయాలంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు కేటుగాళ్లు.. ఈ వ్యవహారం ఆయన దృష్టికి రావడంతో.. ఈ వ్యవహారంపై స్పందించిన వెంకయ్యనాయుడు.. తన పేరుతో వస్తున్న మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు.. తన పేరుతో సహాయం మరియు ఆర్థిక సహాయం కోరుతూ వాట్సాప్ సందేశాలు వస్తే ప్రజలు పట్టించుకోవద్దని హెచ్చరించారు. ఇక, ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చింది ఉపరాష్ట్రపతి కార్యాలయం. ఒక అధికారిక ప్రకటనలో భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేరుతో మొబైల్ నంబర్ 9439073183 నుండి సహాయం మరియు ఆర్థిక సహాయం కోరుతూ వాట్సాప్ సందేశాలను పంపుతున్నారని.. వాటికి స్పందించవద్దని సూచించారు. మరిన్ని నంబర్ల నుంచి ఇలాంటి నకిలీ సందేశాలు వెలువడే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.