NTV Telugu Site icon

Ebrahim Raisi: భారత్ తరుపున ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతి..

Iran

Iran

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ , విదేశాంగ మంత్రి హెస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌ల మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ తరుపున బుధవారం ఇరాన్‌లో జరిగిన రైసీ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఇరువురు నేతల మరణం పట్ల ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ మోఖ్‌బర్‌ని కలుసుకుని ధన్‌కర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అధికారిక అంత్యక్రియల్లో భారత ప్రతినిధి బృందానికి ఉపరాష్ట్రపతి నాయకత్వం వహించారు.

Read Also: Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..

రైసీ మరణానికి గౌరవ సూచకంగా మంగళవారం భారత్ అంతటా ఒక రోజు సంతాపాన్ని పటాటించారు. వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ఇతర అధికారులకు నివాళులు అర్పిస్తున్న ఫోటోను ఆయన కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అధికారిక అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతికి అక్కడి అధికారులు టెహ్రాన్‌లో స్వాగతం పలికారు. అంతకుముందు రైసీ మరణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. మంగళవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి సంతాపాన్ని తెలియజేశారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్‌ ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని ఒక ఉమ్మడి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి, తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆదివారం ఈ ఘటన సంభవించింది. విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో బుధవారం వీరిద్దరి అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Show comments