అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ గుజరాత్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ తగిలినట్టు అయ్యింది.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు సీనియర్ నేత, మాజీ మంత్రి జేఎన్ వ్యాస్.. ఈ నేపథ్యంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.. పార్టీలో ఫ్యాక్షనిజం పెరిగిపోయిందని, కొందరు నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పఠాన్ ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ వ్యవహారం తీవ్రంగా ఉందని మండిపడ్డారు.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో.. 2007 నుంచి 2012 వరకు మోడీ కేబినెట్‌గా మంత్రిగా పనిచేశారు. ఇక, తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్ లేదా ఆప్‌లో చేరడానికి తనకు రెండు ఎంపికలు ఉన్నాయని, మద్దతుదారులను సంప్రదించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
Read Also: Koti Deepotsavam Day 7 Highlights : కన్నులపండువగా తిరుమల శ్రీనివాస కల్యాణం
ఇదే సమయంలో బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ను ప్రశంసించారు జేఎన్ వ్యాస్.. పాటిల్ తన పట్ల చాలా దయతో ఉన్నారన్న ఆయన.. నేను ఏదైనా సమస్యపై అతనిని సంప్రదించినప్పుడు, అతను దానిని పరిష్కరించాడు. కానీ, ప్రతి చిన్న సమస్యకూ నేను పార్టీ అధ్యక్షుడిని సంప్రదించడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. తాను ఇంతకుముందు కూడా రాజీనామా చేశానని, అయితే పాటిల్ రంగంలోకి దిగి రాజీనామాను ఉపసంహరించుకునేలా చూసుకున్నారన్న తెలిపారు. కాగా, అక్టోబర్ 29న, వ్యాస్.. రాజస్థాన్ ముఖ్యమంత్రి మరియు గుజరాత్ ఇన్‌ఛార్జ్ సీనియర్ కాంగ్రెస్ పరిశీలకుడు అశోక్ గెహ్లాట్‌ను అహ్మదాబాద్‌లో కలిశారు.. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మరి ఈ సీనియర్ నేత ఏ పార్టీలో చేరతారు.. మళ్లీ పోటీ చేస్తారా? అనేది వేచిచూడాల్సిన విషయం.