TVK Vijay vs Police: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్ కొనసాగుతుంది. తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్, డీఎంకే చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సర్కార్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ సందర్భంగా టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలపై పోలీసుల కౌంటర్ ఇచ్చారు. కరూర్ ర్యాలీ గురించి విజయ్ అసత్యాలు చెప్పాడు అని పేర్కొన్నారు. క్రౌడ్ను మేనేజ్ చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలం కాలేదు.. తొక్కిసలాటకు టీవీకే ప్రతినిధులే కారణం అన్నారు.
Read Also: Aryan : అంచనాలు పెంచేలా ‘ఆర్యన్’ టీజర్
అయితే, భారీగా జనం రావడమే ఈ గందరగోళానికి కారణం అయిందని పోలీసులు పేర్కొన్నారు. తాము 20 వేల మంది వస్తారని అంచనా వేశాం.. కానీ, 10 వేల మంది మాత్రమే వస్తారని టీవీకే ప్రతినిధులు చెప్పారు అని పోలీసులు తెలియజేశారు. కరూర్ లో జరిగిన ర్యాలీలో ఎలాంటి పవర్ కట్ జరగలేదు.. పోలీసులు కూడా ఎవరిని కొట్టలేదు, కేవలం ముందుకు మాత్రమే నెట్టారు అని వెల్లడించారు.
Read Also: Donald Trump: ‘‘వారిద్దరు అద్భుతం’’.. పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసల జల్లు..
మరోవైపు, 41 మంది చనిపోయిన 72 గంటల తర్వాత టీవీకే చీఫ్ విజయ్ మీడియా ముందుకు వచ్చారు. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కొలేదు.. నేను ఏ తప్పూ చేయలేదు.. త్వరలో బాధితులను కలుస్తాను అన్నారు. నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. నన్ను టార్గెట్ చేయండి, నా ప్రజలను కాదని తెలిపారు. సీఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, నన్ను ఏమైనా చేసుకోండి.. ఏ తప్పు చేయని మా నేతలపై ఎందుకు కేసులు పెట్టారు అని ప్రశ్నించారు. నా కార్యకర్తల జోలికి వెళ్లొద్దు.. నాతోనే ఫైట్ చేయండి అని చెప్పుకొచ్చారు. నేనూ మనిషినే, అంత మంది చనిపోతే వెళ్లిపోతానా అని విజయ్ క్వశ్చన్ చేశారు.
