Aryan : అంచనాలు పెంచేలా ‘ఆర్యన్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుభ్ర & ఆర్యన్ రమేష్ తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక థ్రిల్లింగ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్ ని తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో, విష్ణు విశాల్ ఆకట్టుకున్నారు. 34 నెలల విరామం తర్వాత, విష్ణు విశాల్ ఈ శక్తివంతమైన టీజర్ తో సోలో లీడ్ గా కం బ్యాక్ ఇచ్చారు.
Also Read :Vayyari Vayyari : ఆకట్టుకుంటోన్న ‘ప్రీ వెడ్డింగ్ షో’ ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో
Also Read
‘రాట్ససన్’ విజయం తర్వాత, విష్ణు విశాల్ మరోసారి ‘ఆర్యన్’ లో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఒక యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ నటించిన FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయిత. ఆర్యన్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ మ్యూజిక్ లాంచ్ అప్‌డేట్‌లు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!