Site icon NTV Telugu

దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాలి: వెంకయ్యనాయుడు

భారతదేశ ఇంధన భద్రతకోసం దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు. పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి మరింత కృషి జరగాలని దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

Read Also: కేంద్రం మీద నెపం నెట్టి.. గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నం: రాములునాయక్‌

పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల మధ్య అనుసంధానం అత్యంత కీలకమని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా టీకా అందరూ వేసుకోవాలని, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితుల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.

Exit mobile version