దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల ర్యాలీలతో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రి కర్ఫ్యూ పెట్టి, పగలు ర్యాలీలకు లక్షల మందిని పోగు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు.
Read Also:ఒమిక్రాన్‌పై యుద్ధానికి.. ఆ దేశంలో నాలుగో డోసు
దీని వల్ల కేసుల సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో ఆరోగ్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేని నేపథ్యంలో.. మన ప్రాధాన్యత ఒమిక్రాన్ కేసులను తగ్గించడానికా.. లేక ఎన్నికలా…? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని ప్రభుత్వం ఇప్పటికి తన ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్విట్టర్ వేదికగా వరుణ్ గాంధీ అన్నారు.
