NTV Telugu Site icon

Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..

Vande Bharat Sleeper Trains

Vande Bharat Sleeper Trains

Vande Bharat Sleeper: భారతీయ రైల్వే మరింత అధునాతనంగా తయారవుతోంది. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం వందేభారత్ రైళ్లను తీసుకువచ్చింది. ప్రయాణికులు మరింత తొందరగా గమ్యస్థానం చేరేందుకు ఈ రైళ్లను దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రపంచ స్థాయి ఫీచర్లను ఈ కొత్త రైళ్లలో అందిస్తున్నారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూర్‌లోని బీఈఎంఎల్‌లో కొత్త వందేభారత్ స్లీపర్ కోచ్‌లను పరిశీలించారు. ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. వందేభారత్, చైర్ కార్ వందేభారత్ మెట్రో, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ అనే నాలుగు కాన్ఫిగరేషన్లలో త్వరలో దేశంలో మెరుగైన రైలు సేవల్ని అందిస్తాయని ఆయన అన్నారు. ప్రజల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌తో వందేభారత్ ప్రతీ వెర్షన్‌ని మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

Read Also: West Bengal: కోల్‌కతా ఘటన మరవకముందే.. బెంగాల్ హాస్పిటల్‌లో నర్స్‌పై వేధింపులు..

ట్రైన్ ఫీచర్లు:

వందే భారత్ స్లీపర్ రైలు సెట్ స్టెయిన్‌లెస్-స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రయాణికలు భద్రతను పెంచడానికి మరిన్ని ఫీచర్లను జోడించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ బఫర్‌లు, కప్లర్‌ల వంటి అధునాతన క్రాష్‌వర్తీ ఎలిమెంట్లు అమర్చబడ్డాయి. ట్రెయిన్ కఠినమై అగ్నిప్రమాదాలను కూడా తట్టుకునేలా రూపొందిచారు.

స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. ఇందులో 11 ఏసీ త్రి టైర్ కోచుల్లో 611 బెర్తులు, 4 ఏసీ టూ టైర్ కోచుల్లో 188 బెర్తులు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. వందేభారత్ స్లీపర్ కోచ్ మరింతగా అప్‌గ్రేడ్ అవుతోంది. ఇంటీరియర్స్ ప్యానెల్స్, సీట్లు, బెర్తులు అన్ని కొత్తగా ఉన్నాయి. BEML ఎలక్ట్రికల్, ప్రొపల్షన్, బోగీలు, ఎక్స్‌టీరియర్ ప్లగ్ డోర్లు, బ్రేక్ సిస్టమ్‌లు మరియు HVAC వంటి కీలకమైన సిస్టమ్‌ల ఉన్నాయి. గంటలకు 160 కి.మీ వేగంతో పరుగు తీసేలా రూపొందించారు.

వందే భారత్ యొక్క స్లీపర్ వెర్షన్‌లో యుఎస్‌బి ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ మరియు విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్‌సైడ్ డిస్‌ప్లే ప్యానెల్‌లు మరియు సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు మరియు విభిన్నంగా ఉండే ప్రత్యేక బెర్త్‌లు మరియు టాయిలెట్‌లతో సహా ప్రపంచ స్థాయి ఫీచర్లు ఉంటాయి. వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీలో హాట్ వాటర్ షవర్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ఎక్సీటీరయర్ డోర్స్, సెన్సార్ ఆధారంగా పనిచేసతే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్, రిమోట్‌తో పనిచేసే ఫైర్ బారియర్ డోర్లు, ఎర్గోనామిక్‌గా డిజైన్ చేయబడిన వాసన రాని టాయిలెట్ సిస్టమ్, డ్రైవింగ్ సిబ్బంది కోసం టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.