Three Trains on One Track At Rourkela: వందేభారత్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సుందర్‌గఢ్ జిల్లా రూర్కెల్లా రైల్వే స్టేషన్‌కు సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అది గమనించిన మూడు రైళ్ల లోకో పైలెట్టు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంగా తాజా ఈ ఘటన ప్యాసింజర్లను ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. మంగళవారం జార్సుగూడ వెళ్లే ప్యాసింజర్ రైలు రూర్కెలా స్టేషన్ నుంచి బయలుదేరింది. అదే సమయంలో సంబల్పూర్ నుంచి వస్తున్న మేము ప్యాసింజర్ రైలు రూర్కెలా స్టేషన్ చేరుకుంది.
ఈ క్రమంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. రెండు రైళ్లు వంద మీటర్ల దూరంగా ఉండగా గమనించిన లోకోపైలట్లు వెంటనే అప్రమత్తమై రైళ్లను ఆపు చేశారు. దీంతో ప్యాసింజర్లు, స్టేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిగ్నల్ క్లియర్ చేసే పనిలో స్టేషన్ అధికారులు ఉండగా కొద్ది సేపటికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్‌పైకి వచ్చింది. పూరీ నుంచి వస్తున్న వందేభారత్ అదే సమయంలో రూర్కెలా స్టేషన్ సమీపంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రూర్కెలాకు 200 కిలోమీటర్లోనే వందేభారత్‌ను ఆపుచేశారు. అలా అధికారుల అప్రమత్తతో దీంతో పెను ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారలుఉ అభిప్రాయ పడుతున్నారు. ఆ రూట్లోని వివిధ రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉండటం.. ఆ సమయంలో అవి పనిచేయకపోవడం వల్లే ఈ ఘటన కారణమై ఉంటుందంటన్నారు.