Vada Pav Best Sandwiches In The World: ‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ ను కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడాపావ్ అంతర్జాతీయ గుర్తింపును పొందింది. దీనికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లలో ఒకటిగా నిలిచింది. ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లతో ఓ జాబితా రూపొందించింది. దీంట్లో వడాపావ్ 13వ స్థానంలో నిలిచింది.
Read Also: Kapil Sibal: బీజేపీపై పోరాటానికి సిబల్ కొత్త వేదిక.. సీఎంలు కలిసి రావాలంటూ పిలుపు
టేస్ట్ అట్లాస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో 50 విజేత శాండ్‌విచ్‌ల జాబితాను పోస్ట్ చేసింది. ఇది ప్రపంచంలోని 100 అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాకు సంబంధించి లింక్ షేర్ చేసింది. ఈ జాబితాలో టర్కీకి చెందిన టోంబిక్ 1వ ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో క్యూబన్ శాండ్‌విచ్, అవకాడో టోస్ట్, ఫ్రెంచ్ డిప్ శాండ్‌విచ్ లు ఉన్నాయి.
వడాపావ్ గురించి మాట్లాడితే..ఈ ఐకానికి స్ట్రీట్ ఫుడ్ ముందుగా ముంబై దాదార్ రైల్వే స్టేషన్ లో అశోక్ వైద్య అనే వీధి వ్యాపారి నుంచి ఉద్భవించింది. ఆకలితో ఉన్న కార్మికులకు తక్కువ ధరతో, ఎక్కవ శక్తినిచ్చే వంటకాన్ని సులభంగా తయారుచేయాలని అనుకున్న సమయంలో ఈ వడాపావ్ తయారు చేశారు. ఆ తరువాత ముంబై వ్యాప్తంగా వడాపావ్ విస్తరించి, ఇప్పుడు దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.